![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు(Podharillu )'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-141 లో.. మహా రాత్రి వేళ తన గదిలో పడుకుంటే చక్రి తాగిన మత్తులో తన గదిలోకి వెళ్ళి గడియ పెడతాడు. ఇక తాగిన కత్తులో మహా దగ్గరకి వెళ్తుంటే తను లేచి చూస్తుంది. ఏంటి నువ్వు ఇక్కడ అని చక్రిని తోసేస్తుంది. నువ్వు నా భార్య. నేను నీ భర్త అందుకే వచ్చానని చక్రి అనగానే మహా భయపడుతుంది. వెంటనే మహా గడియ తీసుకోబోతుండగా చక్రి వచ్చి తలుపుకి అడ్డుగా నిలబడతాడు. ఏంటి.. ఎక్కడికి వెళ్తావ్.. మనమిద్దరం భార్యాభర్తలమని చక్రి అనగానే మహా కంగారుపడుతుంది.
పెద్ది, పెద్ది అని మహా అరుస్తుంది. ఆ అరుపులకి పెద్ది, కేశవ, కన్నా, నారాయణ అందరు వస్తారు. డోర్ తీయడానికి లోపలి నుండి మహా, బయట నుండి కేశవ, కన్నా, పెద్ది వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఇక చక్రిని మహా పక్కకి తోసి డోర్ తీసుకొని వచ్చేస్తుంది. ఇక మహా ఒక పక్కకి వెళ్ళి ఏడుస్తుంది. చక్రిని మాధవ తిడతాడు. అసలు నువ్వు మనిషివేనారా ఒక మృగంలా చేస్తున్నావని మాధవ అంటాడు. నా భార్య దగ్గరికి నేను వెళ్తే తప్పేంటని చక్రి అంటాడు. అసలు మనిషివేనారా అని చక్రి మీద మాధవ చేయి ఎత్తుతాడు.. అది చూసి చక్రి కూడా మాధవ మీద చేయి ఎత్తుతాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఇక కేశవ, కన్నా, మాదవ కలిసి చక్రిని వేరే గదిలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ చక్రిని ఎంత కొట్టినా మొండిమాట మీద ఉంటాడు. నా భార్య దగ్గరికి నన్ను పంపివ్వమని చక్రి అంటుంటే బకెట్ లో వాటర్ తీసుకొచ్చి చక్రి మీద పోసి.. బయటకెళ్ళి గడియపెడతాడు మాధవ.
తెల్లారేదాకా డోర్ తీయకండి అని మాధవ అనగానే కన్నా , కేశవ సరేనని బయట ఉంటారు. ఇక మహా ఏడుస్తూ.. మీరందరు నా వాళ్ళు, నాకు రక్షణగా ఉంటారని నమ్మి తలుపుకి గడియకూడా పెట్టలేదని మహా అంటుంది. దాంతో మాధవ, కేశవ, కన్నా బాధపడతారు. ఇక అందరు కలిసి తనకి ధైర్యం చెప్తారు. గడియపెట్టుకొని పడుకోమని మాధవ అనగానే మహా లోపలికి వెళ్తుంది. ఇక బయట కేశవ, కన్నా, మాధవ ఉంటారు. మహా రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే మహా ఇంట్లో నుండి బయటకి వెళ్ళిపోతుంది. అందరు పిలిచినా తను మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ఆపీక్ కి వెళ్ళిపోతుంది. ఇక చక్రి బయటకు వస్తాడు. అందరికి సారీ చెప్తాడు . అయినా ఎవరు పట్టించుకోడు.ఇక నారాయణ దగ్గరికి చక్రి వచ్చి మాట్లాడతాడు. నువ్వు చెప్పిన మాటల వల్లే నేను రెచ్చిపోయి ఇలా చేశాను.. మొన్నటి వరకు నా లిమిట్స్ లో నేనున్నాను.. నా హక్కులు నేను ఫాలో అయ్యాను.. నువ్వు,ఆ ఓంకారేశ్వర్ చెప్పిన మాటలకి ఇలా చేశాను.. ఇప్పటికే నన్ను భర్తకా చూడట్లేదు మహా.. ఇప్పుడు అసలు మనిషిలా కూడా చూడదు.. నాకు ఏ పాపం తగిలినా అది నీకు కూడా తగులుతుందని చక్రి అనగానే నువ్వు , మహా కలిసి ఉండాలని నేను అలా చెప్పాను కానీ నీ బుద్ధి ఏం అయింది.. మృగంలా ప్రవర్తించమని చెప్పలేదని నారాయణ అంటాడు. ఆ తర్వాత మహాకి సారీ అని వాయిస్ మెసెజ్ చేస్తాడు కానీ తను చూసినా పట్టించుకోదు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |